ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో నీ ఏకచత్రాధిపత్యం ఏంటి..? ప్రజాస్వామ్యం అన్నాక చర్చించుకోవాలి. పార్టీలు అన్నాక మాట్లాడుకోవాలి.. అవేవి లేకుండా దేశాన్నే ప్రభావితం చేసే హక్కు నీకెక్కడిది. అంటే ఈ దేశంలో నీవొక్కడివేనా నిజాయితీ పరుడివి.. దేశం మీద నీకొక్కడికేనా ప్రేమ. పైగా నల్ల కుబేరులకు నా సంగతి తెలుసు. అందుకే అక్రమ
సంపాదనను గంగపాలు చేస్తున్నారన్న నీ అహంకార మాటలు దేనికి నిదర్శనం. కోట్ల కొద్ది డబ్బు కట్టలు ఇంటిలోనే ఉన్నా 2వేల కోసం ఏటీఎం దగ్గర క్యూలో బెట్టానని విర్రవీగిపోతున్నావా..? నీ నిర్ణయాల దాడిని దాటుకుని నల్ల డబ్బు మళ్లీ పుట్టదని సంబరపడిపోతున్నావా..? నిర్ణయం వెలుబడినప్పటి నుంచి నీవెనుక తీస్తున్న గోతులను గుర్తించావా? అనాధగా వచ్చిన నిన్ను ఇంతటి వాడిని చేసిన పార్టీకి కూడా పంగనామాలు పెట్టావే.. సర్దుకోమని ఒకమాటైనా చెప్పి ఉంటే నీపై వారికున్న కోపం కాస్త అయినా తగ్గిగేది కదయ్యా..? అసలు ఎందుకు చేశావు ఈ పని.
నీవు ఒక్కడివే పుణ్యాత్ముడివై పోదామనా…ఈ బురద చొక్కాలతో ఓట్లు వేయిస్తేనే గా నీవు ప్రధాన మంత్రివి అయ్యింది ? డబ్బు కట్టలతో అర్ధ రాత్రి ఊరూరు తిరిగిన సంగతి మీకు గుర్తులేకపోయినా.. మాకు గుర్తింది. నీవు ఎవరికి సమాధానం చెప్పకపోయినా. మాకు మాత్రం సమాధానం చెప్పాలి. టీకి దికానా లేని నిన్ను పార్ల మెంట్ కు అధిపతిని చేస్తే .. ఇదా నీవు మాకిచ్చే బహుమానం. చేసింది చాలు చాలు.. నీవు కాకపోతే ఇంకొకరు.. మా వృత్తి ధర్మాన్ని మాత్రం మార్చుకోం. భారత జాతికి పట్టిన దౌర్భాగ్యాన్ని తుడిపేస్తామంటే ఊరుకోం.. ఇప్పటి నుంచి కాసుకో..మంటల్లో తగలబడిపోతున్న మా నోట్ల కట్టల సాక్షిగా..నీ గతి ఏమౌతుందో…!
……. ఓ నల్ల కుబేరుని ఆవేదన

No comments:
Post a Comment