Tuesday, 8 November 2016

టాప్ 5లో జనతా గ్యారేజ్… అధికారిక ప్రకటన..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” బుల్లితెర ప్రదర్శన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం జాబితాలో టాప్ 3 స్థానానికి చేరిన ఈ సినిమాను విడుదలైన 52వ రోజునే టెలివిజన్ లో ప్రసారం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఈ సినిమా టీఆర్పీ రేటింగ్స్ మోత మోగుతాయని అంతా భావించారు. కానీ, తొలినాళ్ళల్లో విడుదలైన సమాచారం మాత్రం అందుకు విరుద్ధంగా వెలువడి, జూనియర్ అభిమానులను నిరుత్సాహపరిచింది.

కానీ, తాజాగా ఈ సినిమాను తన ఛానల్ లో ప్రసారం చేసిన మా టెలివిజన్ సంస్థ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 2016 సంవత్సరానికి గానూ ఇప్పటివరకు ప్రసారమైన సినిమాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని, టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం 20.69 పాయింట్లు సాధించిందని ఒక పోస్టర్ తో కూడిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. దీంతో అంతకు ముందు విడుదలైన సమాచారం తప్పని, లేటెస్ట్ గణాంకాల ప్రకారం ‘జనతా గ్యారేజ్’ను బుల్లితెరపై రికార్డ్ స్థాయిలో వీక్షించారని, యంగ్ టైగర్ అభిమానులు సందడి చేస్తున్నారు.

అయితే ఆల్ టైం జాబితాను పరిశీలిస్తే… జనతా గ్యారేజ్ టాప్ 5లోకి ఎంటర్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తొలి స్థానంలో ‘మగధీర’ నిలువగా, రెండవ స్థానంలో ‘బాహుబలి,’ మూడవ ప్లేస్ లో ‘శ్రీమంతుడు’ నిలిచాయని, ఆ తర్వాత స్థానాన్ని ‘జనతా గ్యారేజ్’ దక్కించుకుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మొదటి నాలుగు స్థానాలను గమనిస్తే… రెండు సినిమాలు రాజమౌళి, రెండు సినిమాలు కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలున్నాయి. ఇక నాలుగు సినిమాలు కూడా నాలుగు హీరోల కుటుంబాలకు చెందినవి కావడం విశేషం.

No comments:

Post a Comment