Sunday, 6 November 2016

Trivikram birthday special next movie updates

Trivikram Srinivas, the name which has cult following equivalent to most of our top heroes. And why is this? Because frankly in most of his movies, he is the real hero.

His lines are so inspirational that no wonder, everybody calls him ‘Guruji’. His movies live inside you… His lines stay with you. They tell us about life. Here are some such lines which defined things in his own style!



అరుణగ్రహంపై మహిళ శరీరం.. గుర్తించిన నాసా రోవర్


లండన్: అరుణగ్రహంపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తీసి పంపిన చిత్రాల్లో ఓ మహిళ శరీరం కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. క్యూరియాసిటీ రోవర్ పంపిస్తున్న చిత్రాలను పరిశోధిస్తున్న యూఎఫ్ఓ హంటర్స్‌కు చెందిన ఏలియన్స్ ఔత్సాహికుడు స్కాట్ సి.వారింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2012 నుంచి మార్స్‌పై చక్కర్లు కొడుతున్న క్యూరియాసిటీ రోవర్ ఆ గ్రహానికి సంబంధించి కీలకమైన ఫొటోలను పంపిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా అది పంపిన ఓ చిత్రంలో పొడవైన జుత్తు, మహిళలు ధరించేలాంటి గౌను వేసుకున్న మహిళ వెల్లకిలా పడుకున్నట్టు ఉంది. దీనికి రంగలు వేసి చూసిన స్కాట్ అది మహిళ శరీరమేనని నిర్ధారించారు. ఇది ఈ శతాబ్దంలో కనుగొన్న గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటి వరకు మార్స్‌పై వందల కొలదీ కొత్త విషయాలను కనుగొన్నానని, అయితే ఇలా మానవునిలాంటి శరీరాన్ని కనుగొనడం ఇదే తొలిసారి ఆయన పేర్కొన్నారు. నాసా చిత్రంలో కనుగొన్న మహిళ ధరించినట్టుగా చెబుతున్న డ్రెస్ 1700 సంవత్సరాలలో భూమిపై ధరించేవారని ఆయన వివరించారు.

ఇంటర్నెట్ పని చేయనప్పుడు ఇలా చేయండి

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఇంటర్నెట్‌‌‌తో ముడిపడి ఉంటుంది. కొందరు నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని స్థితిలో ఉంటారు. ఆఫీస్ అయిపోయాక ఇంటిలో కూడా కొందరు నెట్‌తోనే సమయాన్ని గడుపుతూ ఉంటారు. సడన్‌గా మీరు ఇంటర్నెట్‌కు ఒకరోజంతా దూరం అయ్యారనుకోండి అప్పడు ఏం చేయాలో అని తెగ ఆలోచించకండి. ఇంటర్నెట్ ఫ్రీ జోన్‌లోనూ మనం హాయిగా.. ఆనందంగా గడపొచ్చు.

1. అలా వాకింగ్‌కు వెళ్లిరండి. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చాలా రోజులుగా మీరు కోల్పొతున్న ఆనందాన్ని పొందడానికి వీలుంటుంది.
2. మీ స్నేహితులను ఒకసారి కలిసిరండి. రోజూ చాటింగ్‌లలో మీరు అందరికీ టచ్‌లో ఉండి ఉండొచ్చు కానీ డైరెక్ట్‌గా మీట్ కావడం వల్ల మీరు మనసు విప్పి మాట్లాడడానికి వీలవుతుంది.

3. రోజూ ఇంటర్నెట్‌లో మీరు ఏదో ఒకటి చదువుతుండవొచ్చు కానీ పుస్తకాలు తెరచి చాలా రోజులు అయి ఉంటుంది. అందువల్ల మీకు నచ్చిన బుక్స్‌ను ఒకసారి తెరవండి. హాయిగా చదువుకోండి.
4. మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకుని వింటూ ఆ ఆనందంలో తేలిపోండి.

5. కాసేపు సరదాగా కుటుంబంతో గడపండి. రోజూ పని ఒత్తిడితో ఉండడం, ఒకవేళ ఇంటికొచ్చినా ఇంటర్నెట్‌లో చాటింగ్ చేసుకుంటూ బిజీగా ఉండడంతోనే సరిపోతుంటుంది. అందువల్ల కొద్దిసేపు కుటుంబ సభ్యులతో జాలీగా గడపండి.
6. మీలో మీరే ఆలోచిస్తూ గడపండి. మీ స్వీట్ మెమొరీస్‌స్ ఒకసారి గుర్తు చేసుకోండి.

7. మీరు చాలా పనులు మధ్యలో ఆపి వేసి ఉంటారు. వాటన్నింటినీ మళ్లీ ప్రారంభించండి. వీలైతే పూర్తి చేయండి. ఏదైనా రాయడం ప్రారంభించి ఆపివేయడంలాంటివి చేసి ఉంటారు. అలాంటివి కంప్లీట్ చేయండి.
8. మీరు రోజూ సెల్‌లో క్యాండీక్రష్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాటిని ఒక్కసారి పక్కన పెట్టి కొద్దిసేపు మీకు నచ్చిన అవుట్ డోర్ గేమ్స్ ఆడండి. బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, క్రికెట్ ఇలాంటివి ఆడండి.

Saturday, 5 November 2016

Case FILED on Jabardasth Comedy Show |

The “Jabardasth” Katharnak Comedy Show is a popular Telugu TV comedy show, rated “excellent” among Telugu, broadcast on ETV channel, in Telugu States, India. The show was first telecast on ETV on 7 February 2013, featuring popular Telugu film industry actor and producer Nagendra Babu and Telugu film actress and politician Roja.Episode concept:The concept was primarily, a competition between six different teams, later on it became between five teams who on a weekly basis compete with each other by performing a comedy skit. At the end of the show all teams will be scored out of 10 points by judges Nagababu and Roja. Finally winner will be announced and rewarded with a 10,000 rupee cash prize and poster of the week will be decided based on the skit performed by the winner.In addition to the comedy skits, all team leaders were used to tell a joke and would be rewarded with a 10,000 rupee cash prize for the best joke of the day. But later on it was removed from the show.

ట్రంప్.. హిల్లరీ మంచి ఫ్రెండ్స్

అవును మీరు చదివింది నిజమే. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింటన్, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి ట్రంప్ ఒక‌ప్పుడు మంచి స్నేహితుల్లా ఉండేవారంట. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా దేశాధ్య‌క్ష పదవి రేసుకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులుగా మారారు. డోనాల్డ్ ట్రంప్ 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు జ‌రిగిన వెడ్డింగ్ రిషెప్ష‌న్‌కు క్లింట‌న్ దంప‌తులు వెళ్లారు. 

అప్పుడు వీరంతా ఎంత హ్యాపీగా ముచ్చటించుకున్నారో మనం ఫొటోలో చూడొచ్చు. ఇప్పడేమో హిల్ల‌రీ, ట్రంప్ రోజూ ఒకరిపై ఒకరు విమర్శించు కుంటూ అధ్యక్షపదవి కోసం తీవ్రంగా పోటీప‌డుతున్నారు. రాజకీయాలంటే అలాగే ఉంటాయి మరి. మొత్తానికి ఈ నెల 8న అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 
మామా! ... నేను ధర్మ విధ్వంసకుణ్ణా..!

శింగమాల సుబ్రహ్మణ్యం

అనూహ్యంగా కర్ణుడు ప్రయోగించిన ఆయుధం నా ఛాతీ నుండి దూసుకెళ్ళి వీపును చీల్చేసింది. నా చావు ఖాయమైపోయింది. దుర్యోధనాదులకు నిద్రాహారాలను దూరం చేసి వారిని మృత్యుకుహరం వరకు తీసుకెళ్ళగలిగాను కానీ, నా పితృదేవులైన పాండవులను పూర్తిగా విజయలక్ష్మి వరించకుండానే అవశుడనై నేలకూలాను. అదే నా బాధ! నా శరీరం అవనిని తాకి క్రమంగా నిశ్చల స్థితికి చేరుకుంటోంది. శత్రు సైన్యంలో హర్షాతిరేకాలు, పాండవ సైన్యంలో హాహాకారాలు.నాకు నా తల్లి, భార్య గుర్తుకొస్తున్నారు. ఇక వారికి దిక్కెవరు? ఇప్పటికే ఈ యుద్ధంలో కొడుకుని పోగొట్టుకున్న నా భార్య ఇప్పుడు నన్ను కూడా పోగొట్టుకుంటోంది. నా తల్లికి భర్త ఉన్నా లేనట్టే! నా జననంతోనే ఆమె వివాహబంధం తెగిపోయింది. అప్పటి నుండి ఆమెకు అన్నీ నేనే. నా తండ్రి జ్ఞాపకాల్ని నాలో చూసుకుంటూ బతుకుతోంది. తన ఆత్మీయులందర్నీ పోగొట్టుకుని అభాగ్యురాలిగా నిలబడిన ఆమెకు నా తండ్రి అండగా ఉంటాడా? ఒకవేళ అండగా ఉండాలని తలచినా ఇంతకాలం తర్వాత ఆమె అందుకు సమ్మతిస్తుందా? ఆమె ఆత్మాభిమానం అటువంటిది మరి!నా జనకుని పిలుపుతో నేను యుద్ధానికి బయలుదేరినపుడు తనకు ఇష్టం లేకపోయినా నన్ను మనసారా ఆశీర్వదించి పంపింది ఆ పిచ్చితల్లి. ఆశీర్వచనంలోని కంటతడి నా కంటపడకపోలేదు. తన పవిత్ర ప్రేమకు గుర్తుగా నిలిచిన నేను తనకు దూరమౌతానేమోనన్న భయమేమో? ఇప్పుడిప్పుడే అది నాకవగతమౌతోంది. యుద్ధంలో మరణిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందంటారు.
 కానీ నా ప్రాణం ఇంకా శరీరంలోనే కొట్టుమిట్టాడుతోందేమిటి! ఏదీ... ఆ స్వర్గం? అయినా నా పిచ్చిగాని, అత్యంత ఆత్మీయులైన తల్లి, భార్యాపుత్రుల దగ్గర దొరకని ప్రేమ స్వర్గంలో దొరుకుతుందా!ఎక్కడ చూసినా మృతదేహాలు, తెగిపడిన తలలు, ఇతర అవయవాలు. అక్కడక్కడా మాంస ఖండాలు. రక్తం ఏరులై పారుతోంది. ఆ వాసన ముక్కుపుటాలను గాఢంగా తాకుతోంది. కొందరు వీరులు తీవ్ర గాయాలతో నేలకొరిగినా వారి ప్రాణాలు తీసుకుపోకుండా యముడు దాగుడుమూతలాడుతున్నాడు. మరణయాతన భరించలేక వారు పెట్టే అరుపులు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. యమధర్మరాజు కెందుకింత నిర్దయ! నా ప్రాణాన్ని కూడా నా శరీరాన్నుండి వేరు చేయకుండా ఆయన ఆటలాడుకుంటున్నాడెందుకు?నా కళ్ళు మూతపడీ పడనట్టున్నాయ్‌. అప్పటికే సోదర సమేతంగా నా తండ్రి, కృష్ణ మామ, ఇంకా స్వపక్షంలోని చాలామంది యోధులు నా చుట్టూ చేరారు. అందరి కళ్ళల్లో నీళ్ళు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. విచార వదనాలతో కొందరు యోధులు తన వీరత్వాన్ని గుర్తుచేసుకుని బాధపడటం వినబడుతోంది.ఇంతలో పాంచజన్య ఘోష వినబడింది. బలవంతంగా కళ్ళు తెరిచేందుకు ప్రయత్నించాను. పూరించిన పాంచజన్యాన్ని రథంపై పెట్టి అత్యంతుల్లాసంతో నృత్యం చేస్తున్నాడు కృష్ణ మామ. ఏమిటీ వింత! ఆశ్చర్యంగా ఉంది. నా అంతం అతనికి అంత సంతోషాన్నిస్తోందా! ఒక్కసారిగా నేను దిగ్భ్రమకు గురయ్యాను. నా పితృదేవుల పరిస్థితీ అదే! ఇక శత్రుసైన్యాల పరిస్థితి మాకంటే అగమ్యగోచరంగా ఉంది. పాండవ సైన్యాలను తన కనుసైగలతో నడిపించే అనధికార సైన్యాధ్యక్షుడాయన. స్వపక్షంలోని ఒక వీరుడు నేలకొరిగితే ఆయనకు అంత సంతోషం ఎందుకు?

Wednesday, 2 November 2016

ఫేస్‌బుక్‌ యూజర్లకు ఆయుష్షు ఎక్కువే

ఫేస్‌బుక్‌ యూజర్లకు ఆయుష్షు ఎక్కువే

ఆంధ్రజ్యోతి, 01-11-2016: ఫేస్‌బుక్‌ను వాడుతున్నవారికి ఇది నిజంగా శుభవార్తే. ఇతరులతో పోలిస్తే ఫేస్‌బుక్‌ యూజర్లు ఎక్కువ కాలం జీవిస్తారని నిర్ధారణ అయింది. సోషల్‌ మీడియాను వినియోగిస్తున్న దాదాపు కోటీ ఇరవై లక్షల మంది యూజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే ఆన్‌లైన్‌లో స్నేహితులను పెంచుకోవడంతో పాటు బాహ్య ప్రపంచంలోనూ మంచి సంబంధ, బాంధవ్యాలు కలిగి ఉండేవారే చిరకాలం సంతోషంగా జీవిస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు. గడిచిన ఆరు నెలలుగా యూఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన ఫేస్‌బుక్‌ యూజర్ల ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ను స్టడీ చేశారు. ఆన్‌లైన్‌ స్నేహితుల సంఖ్య, వారు పోస్ట్‌ చేసిన ఫొటోలు, స్టేటస్‌ అప్‌డేట్స్‌, పంపిన మెసేజ్‌ల సంఖ్య మొదలైన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్నవారు, ఎక్కువ సంఖ్యలో ఫ్రెండ్షిప్‌ రిక్వె్‌స్టలు యాక్సెప్ట్‌ చేసినవారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేలింది. అయితే ఆన్‌లైన్‌లో ఉండమన్నారు కదా అని అదే పనిగా రోజుల తరబడి కంప్యూటర్ల ముందు సెటిలైపోతే ఆయుర్దాయం పెరగడం మాట అటుంచి, శారీరకంగా, మానసికంగా ఎన్నో దుష్ప్రభావాల బారినపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆఫ్‌లైన్‌ స్నేహాలను, ఆన్‌లైన్‌ స్నేహాలను చక్కగా సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.